విజయవాడ: భారత రాజ్యాంగం కాపాడాలని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్ఫోరెట్స్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం స్మృతి వనం వద్ద కెవిపియస్ మరియు దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ” రాజ్యాంగ పీఠిక పఠనం” కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెమెడ క్రాంతి కుమార్, అలిండియా దళిత, గిరిజన, బలహీన మైనారిటీ సంఘాల అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్, జైభీమ్ భారత్ పార్టీ మహిళా నాయకులు గ్రేష మేరి, కెవిపియస్ విజయవాడ నాయకులు చింతల శ్రీనివాస్, కొసనం వర్ధన్, వరప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
Official account of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.