Skip to main content

పారిశ్రామిక సమ్మిట్‌ పేరిట కార్పొరేట్లకు వరాలు.. కార్మికులపై భారాలా ?



విశాఖలో ఎపి లేబర్‌ సమ్మిట్‌ – 2025

విశాఖ : పారిశ్రామిక సమ్మిట్‌ పేరిట కార్పొరేట్లకు వరాలు అందిస్తూ కార్మికులపై భారాలు మోపు తున్నారని పలువురు వక్తలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులంతా ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సమ్మిట్‌కు ప్రత్యామ్నాయంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సిఐటియు అఖిల భారత మహాసభ సందర్భంగా మంగళవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్‌ లేబర్‌ సమ్మిట్‌- 2025’ పేరిట సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.చలం మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. అందువల్ల దేశంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న 31 కోట్ల మంది కార్మికులకు ఎటువంటి రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు. కర్మాగారాల్లో పని చేసే వారు మాత్రమే కార్మికులు కాదని, శ్రమను నమ్ముకొని పనిచేస్తూ, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే వారంతా కార్మికులేనని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభంలో అనేక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో వచ్చాయని, వీటితో దేశానికి ఆదాయం వచ్చిందని వివరించారు. కేంద్రంలో బిజెపి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తోందని విమర్శించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ‘కష్టం మాది – సంపద మీదా’ అన్న నినాదంతో కార్మిక వర్గం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.


మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ… రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలతో నిర్వహిస్తున్న సమ్మిట్‌ ద్వారా పెట్టుబడులు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి వస్తుందని చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. గత పదేళ్లలో విశాఖపట్నంలో అనేక సమ్మిట్లు నిర్వహించారని, వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. ఈ క్రమంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ? ఎంతమందికి ఉపాధి లభించింది ? అని ప్రశ్నించారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులను బలవంతంగా తొలగిస్తోందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు కారు చౌకగా భూములను కట్టబడుతోందన్నారు. రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వివి.రమణమూర్తి మాట్లాడుతూ… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను మూసివేయాలని కుట్ర పన్నుతూ ప్రైవేటు మిట్టల్‌ కంపెనీకి ఆగమేఘాల మీద అన్ని అనుమతులు ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ అధ్యక్షతన సాగిన ఈ సమ్మిట్‌లో ప్రొఫెసర్‌ నిర్మల, ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి జిఎస్‌జె.అచ్యుతరావు, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నాగభూషణం, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జె.అయోధ్యరామ్‌, పలు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం

సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా ...