Skip to main content

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు
- 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక
- మరో 50 మందితో రాష్ట్ర కమిటీ.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ సౌహార్ద్ర సందేశం ఇచ్చారు.

మహాసభల్లో జరిగిన ఎన్నికల్లో కె. నాగభూషణం (అనంతపురం) రాష్ట్ర అధ్యక్షుడిగా, కె. ఉమామహేశ్వరరావు (సెంటర్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు కోశాధికారిగా ఎస్ జ్యోతిబసు(ఎన్ టి ఆర్)ఎన్నికయ్యారు.  మొత్తం 21 మంది ఆఫీస్ బేరర్స్, అలాగే 50 మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో కూడిన కొత్త రాష్ట్ర కమిటీని సభ ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా టి నూకరాజు (విశాఖ),యన్ వై నాయుడు (పార్వతీపురం మన్యం),పి వెంకటరెడ్డి (విశాఖ),సునీల్ (నెల్లూరు),
ధనాల వెంకట్రావు (పశ్చిమ గోదావరి),విజయ (ప్రకాశం) – కో-ఆప్షన్,యన్.టి.ఆర్ మహిళ – కో-ఆప్షన్,గుంటూరు – కో-ఆప్షన్,కార్యదర్శులుగా ఉరుకూటి రాజు (విశాఖ)ఎస్ ఇందీవర (విశాఖ మహిళ)కె శ్రీనివాసరావు (ప్రకాశం), వైవి ప్రసాదరావు (విశాఖ),ఎస్ఎస్ చెంగయ్య (గుంటూరు), లక్ష్మీనారాయణ (సత్యసాయి),జ్యోతిబసు (యన్.టి.ఆర్) కడప – కో-ఆప్షన్, యన్.టి.ఆర్ – కో-ఆప్షన్ ఎన్నికయ్యారు.

ఈ సందర్బంగా మున్సిపల్ పిల్ వర్కర్లు ఎదుర్కొంటున్న వేతన సమస్యలు, పెన్షన్ , శానిటేషన్ కార్మికులకు రక్షణ పరికరాల కొరత, కాంట్రాక్టు–ఔట్‌సోర్సింగ్ విధానంలోని అన్యాయం వంటి అంశాలపై మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికుల హక్కుల రక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది.సమాజ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్ వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని, వారి జీవన–ఉపాధి భద్రత కోసం ప్రత్యేక నిధులు, శాశ్వత ఉద్యోగాలు, ప్రమాద భత్యాలు కల్పించాలని ఫెడరేషన్ తీర్మానించింది.కొత్తగా ఎన్నికైన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలను బలోపేతం చేస్తుందని కమిటీ ప్రకటించింది.


Comments

Popular posts from this blog

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...