Skip to main content

2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ 5 రోజుల పాటు విశాఖపట్టణంలో జరిగే సిఐటియు 18వ ఆలిండియా మహాసభలను జయప్రదం చేయండి!!



సిఐటియు ఆలిండియా మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సి. హెచ్. నరసింగరావు, ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, కార్యదర్శులు కె.ధనలక్ష్మి, దయా రమాదేవి, కె. ఉమామహేశ్వరావు, ఆర్.వి.నర్సింహారావు, కోశాధికారి కె. ఆర్.కె.మూర్తి.

సిఐటియు ఆలిండియా 18వ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ 5 రోజుల పాటు విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ, కన్వెన్షన్ సెంటర్ బీన్రోడ్డులో జరుగుతున్నాయి. ఈ ఆలిండియా మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రతినిధులు పాల్గొంటారు. వివిధ దేశాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ మహాసభలో పాల్గొని సౌహార్థ సందేశం ఇస్తారు. సిఐటియు 1970వ సంవత్సరంలో ఏర్పడింది. సిఐటియు ప్రారంభం నుండి చిరుద్యోగుల, కార్మికుల, ఉద్యోగుల, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నది. నిరంతరం ఉద్యోగ, కార్మిక వర్గాల కోసం పని చేస్తున్న సిఐటియు మహాసభలు జయప్రదం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జనవరి 4న ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగులకు, కార్మికులకు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోంది.


గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలోని బీజేపీ మోడీ, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నాయి. బీజేపీ హిందు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తెచ్చి పాలన సాగిస్తున్నది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నది. పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నది. పెట్టుబడిదారుల దోపిడికి అడ్డంగా ఉన్నాయని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలు, నిరసనలను పట్టించుకోకుండా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొచ్చేందుకు నవంబర్ 21న నోటిఫై చేసి అమలు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్న ఈ లేబర్కోడ్స్ను స్వాతంత్య్రానంతరం చేపట్టిన సమగ్ర కార్మిక, ప్రగతిశీల సంస్కరణలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్స్లో పోస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. నేడు దేశవ్యాప్తంగా పిల్లలకు, మహిళలకు రక్షణ లేదు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించకుండా రాత్రిపూట మహిళలు పని చేయాలని లేబర్కోడ్స్లో పెట్టి అమలుకు పూనుకోవడం మహిళల పట్ల ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అర్ధమవుతుంది. పని ప్రదేశాల్లో లైగింక వేధింపుల నిరోధక, నివారణ చట్టం 2013 దేశవ్యాప్తంగా, సక్రమంగా అమలు చేయని ప్రభుత్వం మహిళలు రాత్రిపూట పని చేయాలని చెప్పడం మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతంది. కార్మికులకు, ఉద్యోగులకు నష్టదాయకమైన లేబర్కోడ్స్కు వ్యతిరేకంగా సిఐటియు అఖిల భారత మహాసభల్లో చర్చించి రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేయడానికి ఈ మహాసభల్లో ప్రణాళికలు రూపొందించబోతున్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఉన్న పెన్షన్ పోయింది. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు లేవు. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్లు అమలు కావడం లేదు. స్కీమ్ కార్మికులకు జీతాలు పెంచలేదు. బిల్డింగ్, మైనింగ్, బీడీ కార్మికుల సంక్షేమం కోసం సెస్ వసూలు చేసి కార్మికుల సంక్షేమ బోర్డులు నిర్వహించాలి. కాని ఈ సంక్షేమబోర్డుల ద్వారా కార్మికులకు చెల్లించాల్సిన క్లయిమ్స్ను చెల్లించడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ పూర్తిగా పోయింది. కాంట్రాక్ట్ కార్మికులు జీవిత కాలం పని చేసి ఎటువంటి ప్రయోజనాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులుగానే రిటైర్ అవుతున్నారు. ప్రజల సంపదలైన విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను, రైల్వేలను, బ్యాంకులు, ఎలసి, పోస్టల్, డిఫెన్స్, బొగ్గు గనులు, సిమెంట్ తదితర వాటన్నింటినీ ప్రైవేటీకరిస్తూ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారు. భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్లో 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎటువంటి నోటీసు, నష్టపరిహారం లేకుండా యాజమాన్యం తొలగించింది. ప్రభుత్వ పాలకులే యాజమాన్యాల పక్షాన చేరి పరిశ్రమల్లో ఎటువంటి తనిఖీలు చేయకపోవడంతో తరచు ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. కానీ దీనికనుగుణంగా జీతాలు పెరగడం లేదు. అసమానతలు తారా స్థాయికి పెరిగాయి. ఈ సమస్యలన్నింటి పైన మహాసభల్లో చర్చించి దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక వర్గాన్ని ఐక్యపర్చి ఉద్యమాలు, పోరాటాలు చేయడానికి మహాసభ తీర్మానాలు చేయనుంది.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం

సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా ...