50 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2006 - 07 తర్వాత కనీస వేతనాలను పెంచలేదు. ఐదు సంవత్సరాýకోసారి కనీస వేతనాల చట్టం ప్రకారం వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచితే యాజమాన్యాలకు లాభాలు తగ్గిపోతాయని కనీస వేతనాలను పెంచలేదు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది. 2012, 2017, 2022లో కనీస వేతనాలను పెంచకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే పని చేశాయి. మన పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఐదు సంవత్సరాల కోసారి వేతనాలు పెంచుతున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కార్మికుల ప్రయోజనం పట్టదు. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు ఏమి లబ్ది చేకూర్చాలని మాత్రమే ఆలోచిస్తున్నది. ఐదు సంవత్సరాలకోసారి వేతనాలు పెంచినట్లయితే కనీస స్థాయిలో ఈ పాటికి రూ. 19 వేల నుండి రూ. 22 వేల వరకూ వచ్చి ఉండేవి. నైపుణ్య స్థాయిని బట్టి మరింతగా వేతనాలు పెరిగి ఉండేవి. మన పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం కూడా వేతనాలను అరకొరగా రూ. 14 వేల నుండి రూ. 20 వేల వరకు పెంచింది. కర్నాటక ప్రభుత్వం మే 23న పెంచిన వేతనాల స్థాయి సంతృప్తికరంగా ఉంది. అక్కడ...
Official account of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.