కార్మికవర్గ సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళి కళ్యాణానికి మార్గ దర్శకుడు కారల్‌మార్క్స్ 143వ, వర్ధంతి కార్యక్రమం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారల్‌మార్క్స్ చిత్ర పటాఇకి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి సోషలిజం ద్వారానే సాధ్యమని నిరూపించిన మహా మేధావి కారల్‌మార్క్స్ అని సిఐటియు నాయకులు కొనియాడారు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం బరితెగించి ఇజ్రాయెల్‌తో కలిపి ఇరాన్‌పై దాడి చేయడం దుర్మార్గ పూరితమని నాయకులు విమర్శించారు. ప్రపంచవ్యాపితంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, దీని మూలంగా చమురు ధరలు పైకి ఎగబాకుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి సమస్యలకు పెట్టుబడిదారీ విధానం పరిష్కారం చూపలేదని సోషలిజం ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పిన మహానీయుడు కారల్‌మార్క్స్ ఆశయ సాధనకు కార్మికవర్గం అంకితం కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, ము...
Official account of the Centre of Indian Trade Unions (CITU), Andhra Pradesh State Committee.