రైల్వే గార్డులు (ట్రైన్ మేనేజర్స్) యొక్క సమస్యల పరిష్కారానికై ఆలిండియా గార్డ్స్ కౌన్సిల్ చేపడుతున్న పోరాటాలకు సిఐటియు మద్దతు
ఎఐజిసి నిర్వహించిన ధర్నాలో శ్రీ నరసింహులు మాట్లాడుతూ నేడు కేంద్రంలో ఉన్న బిజేపి ప్రభుత్వ సరళీకరణ విధానాల అమలు వల్ల రైల్వేలు ప్రైయివేటీకరించబడుతున్నవని, సిబ్బంది సంఖ్యను తగ్గించబడుతున్నదని నేడు రైల్వేలో సేఫ్టీ క్యాటగిరీస్ అయిన లోకో, గార్డ్స్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్ తదితర సెక్షన్స్తో పాటు అన్ని విభాగాల్లో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్న నింపటంలేదని, ఫలితంగా ఉన్న వారిపై పనిభారం, మానసిక ఒత్తిడి పెరిగిందని, అన్నారు. వేరొక ప్రక్క (ట్రైన్ మేనేజర్స్కి 1.1.2024 నుండి డిఎ 50 శాతం దాటినా వారి మైలేజి ఎలవెన్స్లు పెంచలేదని, అలాగే పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను పునరుద్దరించకుంండా కార్మికులను నష్టం దాయకంగా వున్న ఎస్పిఎస్- యుపిఎస్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందని-వీటన్నింటి సమస్యలపై కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు. దేశంలోని కార్మిక వర్గ పోరాటాలకు చాంపియన్ గా ఉన్న సిఐటియు అఖిలభారత మహాసభలు విశాఖపట్టణంలో 2025 డిశంబర్ నుండి 2026 జనవరి వరకు జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు.
ఇంకా ఈ ధర్నాలో మోహన్ దాస్ (ఎఐజిసి- విజయవాడ డివిజన్ కార్యదర్శి), శ్రీ ఎస్.గురుమూర్తి (మాజీ ప్రధాన కార్యదర్శి- ఎఐఎస్ఆర్ఎస్ఎ) శ్రీ ఆర్.వి.రాము (ఎఐఎల్ఆర్ఎస్ఎ) విజయవాడ కార్యదర్శి తదితరులు మాట్లాడారు.
Comments
Post a Comment