సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న


సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న

సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా విశాఖలో డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు శ్రామిక్ ఉత్సవ్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.
ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హైదరాబాదు నగరంలో ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి సుద్దాల అశోక్ తేజ మరియు మరియు ప్రజా కవి, గాయకుడు పాటల రచయిత గోరేటి వెంకన్న లను వారి నివాసంలో కలిసి మహాసభలలో భాగస్వాములు కావాలని, కార్మికోద్యమానికి అండగా నిలవాలని కోరారు.
విశాఖపట్నంలో జరిగే అఖిలభారత మహాసభల కార్యక్రమంలో తాము భాగస్వాములు అవుతామని, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటామని కందారపు మురళికి హామీ ఇచ్చారు. అఖిలభారత మహాసభల కార్యక్రమాలలో తమను భాగస్వాములను చేయటం పట్ల వారు సిఐటియు అఖిలభారత కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లకు ఫోనులో అభినందనలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం