లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ వి.గోపాల్ గౌడ పిలుపు
రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్ట దాయకమైన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల్ గౌడ సందేశమిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. డిసెంబర్ 13న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా సిఐటియు-ఎంబివికే ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జస్టిస్ గోపాల్ గౌడ ప్రసంగిస్తూ వంద సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు బేర సారాలు ఆడే హక్కు లేకుండా లేబర్ కోడ్స్ తయారు చేశారని అన్నారు. కార్మికులకు ఎటువంటి పని, సామాజిక భద్రత భవిష్యత్తులో ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నాయన్నారు. జాతీయ కనీస వేతనం రూ. 178/- రోజుకి ఎలా సరిపోతుందన్నారు. పెరుగుతున్న ధరల...