Skip to main content

Posts

లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ వి.గోపాల్ గౌడ పిలుపు

రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్ట దాయకమైన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల్ గౌడ సందేశమిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. డిసెంబర్ 13న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా సిఐటియు-ఎంబివికే ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జస్టిస్ గోపాల్ గౌడ ప్రసంగిస్తూ వంద సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పెట్టుబడి దారులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు బేర సారాలు ఆడే హక్కు లేకుండా లేబర్ కోడ్స్ తయారు చేశారని అన్నారు. కార్మికులకు ఎటువంటి పని, సామాజిక భద్రత భవిష్యత్తులో ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నాయన్నారు. జాతీయ కనీస వేతనం రూ. 178/- రోజుకి ఎలా సరిపోతుందన్నారు. పెరుగుతున్న ధరల...

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం

సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మహాసభలు కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిఐటియు అఖిలభారత మహాసభలకు 1,300 మంది ప్రతినిధులు హాజరై పాల్గొంటారు. అందులో ఆశా వర్కర్ వర్కర్స్ యూనియన్ నుండి కూడా ప్రతినిధులు దేశ నలుమూలల నుండి ఈ మహాసభకు వస్తున్నారు. ఇప్పటికే సిఐటియు అనేక కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా ఆశా వర్కర్ల సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆశా వర్కర్ల జీతం 10,000 కు మించడం లేదు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే వారు ఆశా వర్కర్లు మాత్రమే. వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. అన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి అనేక సమస్యల పైన ఈ మహాసభలు చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా ...

రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

  విజయవాడ: భారత రాజ్యాంగం కాపాడాలని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేస్తూ కార్ఫోరెట్స్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ వ్యతిరేకిస్తూ విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం స్మృతి వనం వద్ద కెవిపియస్ మరియు దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ” రాజ్యాంగ పీఠిక పఠనం” కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగింది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెమెడ క్రాంతి కుమార్, అలిండియా దళిత, గిరిజన, బలహీన మైనారిటీ సంఘాల అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్, జైభీమ్ భారత్ పార్టీ మహిళా నాయకులు గ్రేష మేరి, కెవిపియస్ విజయవాడ నాయకులు చింతల శ్రీనివాస్, కొసనం వర్ధన్, వరప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న

సిఐటియు అఖిలభారత మహాసభలకు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా విశాఖలో డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు శ్రామిక్ ఉత్సవ్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హైదరాబాదు నగరంలో ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి సుద్దాల అశోక్ తేజ మరియు మరియు ప్రజా కవి, గాయకుడు పాటల రచయిత గోరేటి వెంకన్న లను వారి నివాసంలో కలిసి మహాసభలలో భాగస్వాములు కావాలని, కార్మికోద్యమానికి అండగా నిలవాలని కోరారు. విశాఖపట్నంలో జరిగే అఖిలభారత మహాసభల కార్యక్రమంలో తాము భాగస్వాములు అవుతామని, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటామని కందారపు మురళికి హామీ ఇచ్చారు. అఖిలభారత మహాసభల కార్యక్రమాలలో తమను భాగస్వాములను చేయటం పట్ల వారు సిఐటియు అఖిలభారత కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లకు ఫోనులో అభినందనలు తెలిపారు.

2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ 5 రోజుల పాటు విశాఖపట్టణంలో జరిగే సిఐటియు 18వ ఆలిండియా మహాసభలను జయప్రదం చేయండి!!

సిఐటియు ఆలిండియా మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి. నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సి. హెచ్. నరసింగరావు, ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, కార్యదర్శులు కె.ధనలక్ష్మి, దయా రమాదేవి, కె. ఉమామహేశ్వరావు, ఆర్.వి.నర్సింహారావు, కోశాధికారి కె. ఆర్.కె.మూర్తి. సిఐటియు ఆలిండియా 18వ మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకూ 5 రోజుల పాటు విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ, కన్వెన్షన్ సెంటర్ బీన్రోడ్డులో జరుగుతున్నాయి. ఈ ఆలిండియా మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రతినిధులు పాల్గొంటారు. వివిధ దేశాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ మహాసభలో పాల్గొని సౌహార్థ సందేశం ఇస్తారు. సిఐటియు 1970వ సంవత్సరంలో ఏర్పడింది. సిఐటియు ప్రారంభం నుండి చిరుద్యోగుల, కార్మికుల, ఉద్యోగుల, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నది. నిరంతరం ఉద్యోగ, కార్మిక వర్గాల కోసం పని చేస్తున్న సిఐటియు మహాసభలు జయప్రదం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జనవరి 4న ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఈ...

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటీఫై చేయడాన్ని సి.ఐ.టి.యు ఎ.పి. కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్లను నోటీఫై చేయడాన్ని సి.ఐ.టి.యు ఎ.పి. కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. లేబర్ కోడ్లను నోటిఫై చేయటాన్ని వ్యతిరేకిస్తూ రేపు పెద్దయోత్తున రాష్ట్ర వ్యాపితంగా నోటిఫై చేసిన ఉత్తర్వులను ధగ్ధం చేసి నిరసన తెలియచేయాలని కార్మికులకు, కార్మికసంఘాల నాయకులుక సి.ఐ.టి.యు పిలుపునిస్తున్నది. పెట్టుబడుదారుల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని మరోసారి తేటతెల్లమైంది. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనం కోసం 4 లేబర్ కోడ్లను తెచ్చింది. బిహార్ ఎన్నికల అనంతరం నోటిఫై చేయటం ద్వారా తన కుటిలత్వాన్ని బయటపెట్టుకుంది. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై, లేబర్ కోడ్లు రద్దుకు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. సిహెచ్ నరసింగరావు ప్రధాన కార్యదర్శి ఎ.వి. నాగేశ్వరరావు అధ్యక్షులు  #CITU #LabourCodes #4LabourCodes #BJP #TDP #YCP #Janasena #CPM #CPI #Congress #CITUAndhraPradesh 

కార్మిక, రైతు, కూలీల ద్రోహి సిఎం

సిఎం చంద్రబాబు పై కార్మిక సంఘాల మండిపాటు 26న జిల్లా కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలకు పిలుపు విజయవాడ: కార్మికుల, రైతుల, వ్యవసాయకూలీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి నాయకత్వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగ్ రావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ కార్మికులనుద్ధేశించి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఫ్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అని, కార్మికులు పనిచేయని దొంగలని, వారిపై పిడి యాక్ట్ లు పెడతానని హెచ్చరించటం సిఎం కి సహేతుకం కాదని తప్పు పట్టారు. కార్మిక ద్రోహులు, అధికారమదంతో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అధికారం అధిష్టానం పీఠం ఎక్కినాకా బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్ర నాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు పనిగంటలను పెంపుదల చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేక...