Skip to main content

స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కోరిన సిఐటియు

విశాఖస్టీల్ ప్లాంట్‌లో జూన్ 8 న జరిగిన ప్రమాదానికి బాధ్యులైన స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంగళవారం (23.06.2026)న ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కలసి సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ప్రకటించలేదు. ఫ్యాక్టరీల శాఖ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను నేటికీ వెల్లడించకపోవడం అన్యాయం. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ట్రేడ్ యూనియన్లు మరియు కార్మికులు నిస్సందేహంగా ప్రకటించారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇనుప ద్రావణం ఉండే లాడిల్‌కు కనీసం కవర్‌ను కూడా ఉపయోగించలేదు. విధి విధానాల ప్రకారం ప్రమాదానికి ఆస్కారం ఉండే ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో అంబులెన్స్‌లు ఉండాలి. ప్రమాదం జరిగిన రోజున ఎసఎంఎస్`1 వద్ద అంబులెన్స్ కూడా లేదు. తక్షణ చికిత్స కోసం =IచీL ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే యూనిట్ పనిచేయడం లేదు. భద్రతపై 1.12.2025న ఫ్యాక్టరీల జాయింట్ డైరెక్టర్ జారీ చేసిన మెరుగుదల నోటీసునిచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదు. దానిపై ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నోటీసుపై యాజమాన్యం స్పందించకపోతే చర్యలు చేపట్టాల్సిన ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ చోద్యం చూసింది తప్ప చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్ సకాలంలో స్పందించినట్లయితే ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది కాదు. 8 మంది కార్మికుల విలువైన ప్రాణాలు కాపాడబడి ఉండేవని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తెలియజేశారు. దానికి ఆయన స్పందిస్తూ తక్షణమే ప్రమాదాలు నియంత్రించడానికి తగిన చర్యలు చేపడతామని, యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తామని హామీనిచ్చారు. ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కలిసిన వారిలో సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు మరియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నర్సింహారావు ఉన్నారు.

Comments

Popular posts from this blog

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...