Skip to main content

Posts

Showing posts from June, 2026

స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కోరిన సిఐటియు

విశాఖస్టీల్ ప్లాంట్‌లో జూన్ 8 న జరిగిన ప్రమాదానికి బాధ్యులైన స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మంగళవారం (23.06.2026)న ఫ్యాక్టరీ డైరెక్టర్‌ను కలసి సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది, కానీ ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ప్రకటించలేదు. ఫ్యాక్టరీల శాఖ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను నేటికీ వెల్లడించకపోవడం అన్యాయం. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ట్రేడ్ యూనియన్లు మరియు కార్మికులు నిస్సందేహంగా ప్రకటించారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇనుప ద్రావణం ఉండే లాడిల్‌కు కనీసం కవర్‌ను కూడా ఉపయోగించలేదు. విధి విధానాల ప్రకారం ప్రమాదానికి ఆస్కారం ఉండే ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో అంబులెన్స్‌లు ఉండాలి. ప్రమాదం జరిగిన రోజున ఎసఎంఎస్`1 వద్ద అంబులెన్స్ కూడా లేదు. తక్షణ చికిత్స కోసం =IచీL ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే యూనిట్ పనిచేయడం లేదు. భద్రతపై 1.12.2025న ఫ్యాక్టరీల జాయింట్ డైరెక్టర్ జారీ చేసిన మెరుగుదల నోటీసునిచ్చినా యాజమాన్యం పట్టించుకోలే...

ఉద్యోగుల, కార్మికుల వేతన పెంపు తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగించవచ్చంటూ నిన్న సర్క్యులర్ మెమోను జారీ చేసింది. ఈ సర్క్యులర్ మెమోను జారీ చేయడానికి కూటమి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 114, ది. 21.10.2023 ప్రకారం రెగ్యులర్ కాకుండా మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు ఏపి కమిటీ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఈ ఉద్యోగులు రెగ్యులరైజ్ కానందు వల్ల వారికి అప్పటి నుండి ఎరియర్స్‌ను చెల్లించాలని, సర్వీసు కాలాన్ని పరిగణించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అభివృద్ధి పేరిట పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడంలో చూపించడం లేదు. కార్మికుల పనిగంటలు పెంచడం, పని విస్తృతి పెంచడం, మహిళల చేత రాత్రిపూట పని చేయించడం వంటి కార్మిక చట్టాల మార్పులను కూటమి ప్రభుత్వం ఆఘ మేఘాల మీద చేసింది. పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో చూపిన వేగం 3 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయడంలో చూపడ...