Skip to main content

ఉద్యోగుల, కార్మికుల వేతన పెంపు తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగించవచ్చంటూ నిన్న సర్క్యులర్ మెమోను జారీ చేసింది. ఈ సర్క్యులర్ మెమోను జారీ చేయడానికి కూటమి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీఓ 114, ది. 21.10.2023 ప్రకారం రెగ్యులర్ కాకుండా మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు ఏపి కమిటీ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఈ ఉద్యోగులు రెగ్యులరైజ్ కానందు వల్ల వారికి అప్పటి నుండి ఎరియర్స్‌ను చెల్లించాలని, సర్వీసు కాలాన్ని పరిగణించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అభివృద్ధి పేరిట పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడంలో చూపించడం లేదు. కార్మికుల పనిగంటలు పెంచడం, పని విస్తృతి పెంచడం, మహిళల చేత రాత్రిపూట పని చేయించడం వంటి కార్మిక చట్టాల మార్పులను కూటమి ప్రభుత్వం ఆఘ మేఘాల మీద చేసింది. పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో చూపిన వేగం 3 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయడంలో చూపడం లేదు. ప్రైవేట్ షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచడానికి మనసు రావడం లేదు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నభోజన పథకం, వెలుగు తదితర స్కీమ్ వర్కర్ల వేతన పెంపును తాత్సారం చేస్తున్నది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో గతంలోనే లీగల్ ఒపీనియన్‌తో ఇచ్చిన జీఓ 114 అమల్లో చూపలేదు. సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించడంలో చూపలేదు. రెగ్యులర్ ఉద్యోగులకు బకాయి ఉన్న నాలుగు డీఏ ల అమలు, పీఆర్‌సీ నియామకం, ఐఆర్ చెల్లింపు వంటి అంశాల్లో నత్తనడక నడుస్తున్నది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల పై సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఏపి కమిటీ డిమాండ్ చేస్తున్నది.

Comments

Popular posts from this blog

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి

సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

అధ్యక్ష–ప్రధానకార్యదర్శులుగా కె.నాగభూషణం - కె.ఉమామహేశ్వర రావు - 21 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక - మరో 50 మందితో రాష్ట్ర కమిటీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె నాగభూషణం, కె ఉమామహేశ్వరరావు తిరిగి ఎన్నికయ్యారు.మునిసిపల్  వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 15వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు కొత్త మార్కెట్ వద్ద  జి.సుబ్బారావు నగర్‌లో నవంబర్ 15–16 తేదీల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు మున్సిపల్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చలు జరిపిన ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు తొలి రోజు ఎంఎల్ సి బి గోపిమూర్తి, నిన్న ఈ రోజు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ముఖ్య అతిధులు గా హాజరై శ్రేణులకు దశ, దిశా నిర్దేశం చేశారు. కాగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, ఎ పి మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎపి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్, కెవిపిఎస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి కల్పన, బి రఘురామ్ స...

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

అనంతపురం:  హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని, అప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయని సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లయ్ హమాలీ యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభ అనంతపురం జిల్లా కేంద్రంలోని గణేనాయక్‌ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. సీతారాం ఏచూరి ప్రాంగణంలో సిఐటియు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.కృష్ణ అధ్యక్షతన ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గేయానంద్‌, ఆ సంఘం గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. తొలుత అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మహాసభ నివాళులర్పించింది. మూడు సంవత్సరాల్లో సంఘం ఆధ్వర్యంలో హమాలీల పక్షాన చేసిన పోరాటాలు, సాధించిన హక్కులు తదితర అంశాలపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు నివేదిక ప్రవేశపెట్టారు. గేయానంద్‌, కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ… సివిల్‌ సప్లరు హమాలీల శ్రమకు తగ్గ వేతనం అందడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత క...