డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యమిత్రాలు టీం లీడర్లు మరియు డిస్ట్రిక్ మేనేజర్లు కలిపి మొత్తం 2000 మంది సిబ్బందపనిచేస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వీరికి మార్చి నుండి జీతాలు చెల్లించలేదు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. 18 సంవత్సరాల నుండి వీరు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఆ జీతాలు నెల నెలా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులు దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేసిన బడ్జెట్ రాలేదని సాకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, తక్షణమే స్పందించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రాల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఎపి కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

Comments
Post a Comment