2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి
తేదీ : 28.04.2026
ప్రచురణ / ప్రచురణార్ధం :
2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కా॥ కె.ధనలక్ష్మి అధ్యక్షతన విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులకు రాయభారాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుu్బరావమ్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆమె గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళలందరూ సుదీర్ఘకాలం పోరాడారని వామపక్ష పార్టీల ఎంపీలు పార్టీ పార్లమెంట్‌లో గళమెత్తి నినదించారని ఆమె చెప్పారు. ఈ తీర్మానంపై హాజరైన నాయకులు మాట్లాడారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుచేసే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. 2024 లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుచేయాల్సి ఉండగా మోడీ ప్రభుత్వం మోకాలు ఒడ్డిందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు, డీ లిమిటేషన్, జనాభా లెక్కలు ముడిపెట్టడం మోడీ ప్రభుత్వం కపట నాటకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి మాట్లాడుతూ అనాదిగా దేశంలో పురుషాధిక్య వ్యవస్థ రాజ్యమేలుతోందని మహిళల హక్కులు హరించబడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రితో గొంతు కలిపి మహిళలకు దక్షిణాది రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయటం తగదని ఆమె హితవు పలికారు. గత 30
ఏళ్ళుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆటంకాలు సృష్టిస్తూ మహిళాలోకాన్ని మోసగించే చర్యలను ఎన్‌డిఎ పాలకులు ఆపి తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్నారు.
సామాజిక కార్యకర్త కె.వసుంధర, ఐఎఫ్‌టియు నాయకులకు కె.పొలారి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకోసం జరిగే ఉధ్యమాలు, పోరాటాలలో క్షేత్రస్థాయిలో ప్రజానీకాన్ని భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాపితంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయని కార్మిక వర్గం నిర్వహించే పోరాటాల్లో కూడా మహిళా సంఘాలు భాగస్వాములు అవుతాయని ఆమె తెలిపారు. మహిళలను వంటింటి కుందేలుగా మార్చే ఆరఎసఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ఆమె కోరారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్‌పి మనోహర్ కుమార్ లు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలకు కూడా రిజర్వేషన్లు అమలయ్యేవిధంగా చూడాలని వారు ప్రభుత్వాలను కోరారు. జన విజ్ఞాన వేదిక నాయకులు జి.మురళిధర్, డివైఎఫఐ ప్రధాన కార్యదర్శి జి.రామన్న, ఎసఎఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రసన్న కుమార్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ముజఫర్ అహమ్మద్, ఆర్.వి.నరసింహారావు, దయా రమాదేవి, రైల్వే యÖనియన్ నాయకులు వివిఎల్ నరసింహులు, అంగన్‌వాడీ యÖనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్ సుప్రజ, ఫీల్డ్ అసిస్టెంట్ల యÖనియన్ రాష్ట్ర నాయకులు ఎం.హరనాధ్, సోషల్ మీడియా బాధ్యులు సుభాషిణి తదితరులు ప్రసంగించారు.
(సి.హెచ్.నరసింగరావు)
అధ్యక్షులు
(ఏ.వి.నాగేశ్వరరావు)
ప్రధాన కార్యదర్శి

Comments
Post a Comment