కార్మికవర్గ సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళి కళ్యాణానికి మార్గ దర్శకుడు కారల్‌మార్క్స్ 143వ, వర్ధంతి కార్యక్రమం సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారల్‌మార్క్స్ చిత్ర పటాఇకి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి సోషలిజం ద్వారానే సాధ్యమని నిరూపించిన మహా మేధావి కారల్‌మార్క్స్ అని సిఐటియు నాయకులు కొనియాడారు. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం బరితెగించి ఇజ్రాయెల్‌తో కలిపి ఇరాన్‌పై దాడి చేయడం దుర్మార్గ పూరితమని నాయకులు విమర్శించారు. ప్రపంచవ్యాపితంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, దీని మూలంగా చమురు ధరలు పైకి ఎగబాకుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి సమస్యలకు పెట్టుబడిదారీ విధానం పరిష్కారం చూపలేదని సోషలిజం ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పిన మహానీయుడు కారల్‌మార్క్స్ ఆశయ సాధనకు కార్మికవర్గం అంకితం కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, ముజఫర్ అహ్మద్, కె.ఆర్.కె.మూర్తి, ఆర్.వి.నర్సింహారావు, దుర్గాపురం ఏరియా నాయకులు ఎం.శివ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సామాజిక శంఖారావం అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను పరిష్కరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సామాజిక శంఖారావం బృందం వినతి అమరావతి: “సామాజిక శంఖారావం – కులవివక్ష లేని సమాజం కోసం” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని మంగళవారం కలిసి రాష్ట్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అధ్యయనంలో 660 స్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సంబంధిత సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. స్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం అధ్యయన యాత్రల్లో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనని ప్రతినిధులు తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక స్మశాన స్థలాలు లేకపోవడ...

Comments
Post a Comment